దేవినేని నెహ్రూ భూముల్లో ఎర్ర జెండాలు
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ భూముల్లో సిపియం కార్యకర్తలు శుక్రవారంనాడు ఎర్రజెండాలు పాతారు. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని సిపియం కార్యకర్తలు అంటున్నారు. బంజారాహిల్స్ లో 120 కోట్ల రూపాయల విలువ చేసే భూములను దేవినేని నెహ్రూకు క్రమబద్దీకరించానే ఆరోపణ నేపధ్యంలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేవినేని నెహ్రూ భూముల వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు.
దాదాపు 50 మంది సిపియం కార్యకర్తలు పూజలు చేసి భూముల్లో అడుగు పెట్టి ఎర్ర జెండాలు పాతారు. బడా సంస్థలకు, రాజకీయ నాయకులకు ప్రభుత్వం భూములను క్రమబద్దీకరిస్తోందని, అందుకు నెహ్రూకు భూములను కట్టబెట్టిన వైనమే నిదర్శనమని సిపియం నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications
