తెలంగాణవారు కాబట్టే పట్టించుకోవడం లేదు: హరీష్
హైదరాబాద్: గల్ఫ్ బాధితులు ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు కావడం వల్లనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారు అప్పుల బాధ తట్టులేక ఆత్మహత్యలుచేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్నవారు 50 మంది దాకా ఉన్నారని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 5 లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేరళలో మాదిరిగా గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
