ఆక్రమించారు, వెళ్లిపోయారు: దేవినేని నెహ్రూ
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల తన భూములను సిపియం కార్యకర్తలు ఆక్రమించడాన్ని కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ తేలిగ్గా కొట్టిపారేశారు. భూములను అక్రమించారు, వెళ్లిపోయారని ఆయన శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. సిపియం భూముల ఆక్రమణను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే అర్థం ఉంది గానీ పక్కా ప్రైవేట్ పట్టా భూములను ఆక్రమించడంలో అర్థం లేదని ఆయన అన్నారు. సత్యనారాయణ అనే వ్యక్తికి ఆ భూములు రెగ్యులరైజ్ అయ్యాయని, వాటిని అతను తనకు రిజిష్టర్ చేశాడని నెహ్రూ వివరించారు.












Click it and Unblock the Notifications
