తిరుమలలో బెంగూళుర్ తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
తిరుమల: బెంగుళూరుకు చెందిన తల్లీకూతుళ్లు తిరమలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని అంజనాద్రి 429 కాటేజీలో వారిద్దరి శవాలను పోలీసులు కనుక్కున్నారు. కాటేజీ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి తెలియజేశారు. దాంతో పోలీసుల సహకారంతో కాటేజీలోకి వెళ్లి చూడగా వారిద్దరి శవాలు కనిపించాయి. బెంగుళూరుకు చెందిన 29 ఏళ్ల శాంతి తన 11 ఏళ్ల తన కూతురు యశ్వసినితో ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుమలలోని కాటేజీలో దిగింది.
ఆరవ తేదీ ఉదయమే వారు శ్రీవెంకటేశ్వరస్మామిని దర్శించుకున్నారు. స్వామివారి లడ్లు కాటేజీలో కనిపించాయి. ఆరవ తేదీ నుంచి వారు బయటకు రాలేదని తెలుస్తోంది. కూతురికి కొకకోలాలో విషం కలిపి శాంతి తాగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తాను విషం సేవించి శాంతి చీరతో ఉరి వేసుకుంది. ఆర్థిక సమస్యల వల్లనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి అదృశ్యానికి సంబంధించి అలిపిరి పోలీసు స్టేషనులో ఫిర్యాదు నమోదై ఉంది. బెంగుళూరు వారి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. శాంతి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తింపు కార్డును బట్టి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తిరుమలలో 26 మంది ఆత్మహత్య చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
