నిరూపిస్తే దేవినేని నెహ్రూపై పోటీ పెట్టం: గద్దే
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులోని భూముల క్రమబద్దీకరణ తనకు జరిగిందని దేవినేని నెహ్రూ నిరూపిస్తే కంకిపాడు నియోజకవర్గం నుంచి పోటీ లేకుండా గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దే రామ్మోహన్ సవాల్ చేశారు. దాన్ని నిరూపిస్తే 2009, 2014 ఎన్నికల్లో దేవినేని నెహ్రూను పోటీ లేకుండా గెలిపిస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని భూములు వైయస్ ప్రభుత్వ హయాంలోనే నెహ్రూకు క్రమబద్దీకరించారని ఆయన అన్నారు.
తనకు మచిలీపట్నం సమీపంలో ఉన్న భూములను 20 యేళ్ల క్రితం కొనుక్కున్నట్లు ఆయన తెలిపారు. తాను ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని, దేవినేని నెహ్రూ ఆరోపణలు పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. ఆ భూముల్లోని చెరువుల ద్వారా తనకు 20 యేళ్లుగా పైసా ఆదాయం రావడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
