హఫీజ్ పేట భూములపై నారాయణ పాదయాత్ర
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో హఫీజ్ పేట భూముల వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్ పేట భూముల విషయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని ఆయన శనివారం ఈ సందర్భంగా అన్నారు. అన్యాక్రాంతమవుతున్న హఫీజ్ పేట భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.
వివాదాస్పద భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. హఫీజ్ పేట భూముల వ్యవహారంపై ఆయన ఇటీవల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ హామీతో విరమించుకున్నారు. అంతకు ముందు ఆ భూములను సిపిఐ కార్యకర్తలు క్రమించుకున్నారు.












Click it and Unblock the Notifications
