రాధ వ్యవహారం వైయస్ చూసుకుంటారు: నెహ్రూ
విజయవాడ:తమ పార్టీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ రాజీనామాపై తాను స్పందించాల్సిన అవసరం లేదని, అంతా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే చూసుకుంటారని కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ అన్నారు. తెలుగుదేశం నేతలపై ఆయన ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం నాయకుడు గద్దే రామ్మోహన్ రావు అక్రమ భూములను చూపిస్తానని ఆయన బందరు సమీపంలోని పోలడితిప్పకు మీడియా ప్రతినిధుల బృందాన్ని తీసికెళ్లారు.
గద్దే రామ్మోహన్ రావు అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని, 160 ఎకరాల భూములు గద్దే ఆధీనంలో ఉన్నాయని, ఇందులో 80 ఎకరాల భూములు ప్రభుత్వానికి చెందినవని ఆయన అన్నారు. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేదా అని తాను ఏమీ చెప్పలేనని, వాటిని చూపించడం వరకే తన బాధ్యత అని ఆయన అన్నారు. గద్దే రామ్మోహన్ రావు భూముల ఆక్రమణను సాక్ష్యాధారాలను నిరూపిస్తానని ఆయన అంతకు ముందు అన్నారు.












Click it and Unblock the Notifications
