ధర్మాన పిలుపుతో హైదరాబాదుకు వంగవీటి రాధ
విజయవాడ: శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయవాడ తూర్పు శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణను బుజ్జగించే ప్రయత్నం మొదలు పెట్టారు. సమస్య పరిష్కారానికి చర్చల కోసం హైదరాబాద్ రావాల్సిందిగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆహ్వానించారు. దీంతో వంగవీటి రాధాకృష్ణ శనివారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో దేవినేని నెహ్రూకు గల భూములపై చర్చించేందుకు రావాల్సిందిగా రాధాకృష్ణకు ధర్మానను ఆహ్వానించినట్లు సమాచారం.
రాజీనామా సమర్పించిన వంగవీటి రాధాకృష్ణతో తొలుత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మాట్లాడి ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావుతో మాట్లాడాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో మొదటి దశలో ధర్మానతో మాట్లాడిన రాధాకృష్ణ శుక్రవారం విజయవాడకు వచ్చారు. తాను రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. దేవినేని నెహ్రూ భూములకు సంబంధించిన డిమాండును ఆయన ప్రధానంగా పెట్టారు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు తోస్తోంది.












Click it and Unblock the Notifications
