రాధ, నెహ్రూల గొడవ తెలియదు: రోశయ్య


గుంటూరు: తమ పార్టీ కాంగ్రెస్ శాసనసభ్యులు దేవినేని నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణల వ్యవహారం తనకు తెలియదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. రాధాకృష్ణ రాజీనామా విషయం కూడా తనకు తెలియదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభా సమావేశాల తీరు బాగా లేదని ఆయన అన్నారు. శాసనసభా సమావేశాలు గాడి తప్పుతున్నాయని, అందుకు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. జూనియర్ శాసనసభ్యులను సరిచేయాల్సిన సీనియర్ సభ్యులు, జూనియర్ల మాటలను పట్టుకుని గొడవకు దిగుతున్నారని ఆయన అన్నారు.

వరికి మద్దతు ధరపై తాము వీధులకెక్కబోమని ఆయన అన్నారు. వరి ధర ఏదో కొంత మేరకు పెరుగుతుందని, అయితే పెరిగిన ధర వచ్చే ఏడాది నుంచి అమలవుతుందని ఆయన చెప్పారు. వరికి మద్దతు ధర సాధించేందుకు కొందరు ప్రాణాలర్పిస్తామని అంటున్నారని, తాము ప్రాణాలర్పించలేమని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశంచి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+