హైదరాబాద్ లో బంగ్లదేశ్ యువకుడి అరెస్టు


హైదరాబాద్: హైదరాబాదులో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్. రెహ్మాన్ అనే ఈ యువకుడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి యుకెలోని వివిధ వ్యక్తుల నుంచి నిధులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వాటిని తమ మిత్రులు, బంధువులు పంపారని రెహ్మాన్ చెబుతున్నాడని, ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ప్రతినిధులు మాత్రమే పాల్గొనే ఫిదా - ఎ - మిలాయత్ ప్రతినిధుల సదస్సుకు రెహ్మాన్ హాజరయ్యాడని, ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్న ఈ సదస్సుకు అతను పోలీసుల కళ్లు గప్పి హాజరయ్యాడని వారు చెప్పారు. ఆ యువకుడి నుంచి పోలీసులు రేషన్ కార్డు, పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. తాను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు రెహ్మాన్ చెబుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+