వైయస్ వల్లే తెలంగాణ రావడం లేదు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉన్నట్లు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు చెప్పారు. ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎలా ఇస్తామని ప్రధాని అన్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రధానితో పాటు పలువురు పార్టీ జాతీయ నాయకులు చెప్పారని ఆయన అన్నారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం అలా అనలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజశేఖర రెడ్డే కాదు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అలాగే వ్యవహరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వైఖరి మారనంత వరకు తెలంగాణ రాష్ట్రం రాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఖరి మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు సంబంధించి తమ వాదన తమకు ఉందని, ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
