భూపోరు: సిపిఐ నేత నారాయణ అరెస్టు


విజయవాడ: సిపిఐ కార్యదర్శి కె. నారాయణ కృష్ణా జిల్లా పర్యటన సోమవారం ఉద్రిక్తతల మధ్య సాగింది. మచిలీపట్నం సమీపంలోని పల్లే తుమ్మలపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి బయలుదేరిన నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. అందుకు నిరసనగా సిపిఐ కార్యకర్తలు మచిలీపట్నం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు, రాస్తారోకోకు దిగారు. దాంతో నారాయణను పోలీసులు విడుదల చేశారు.

పల్లె తుమ్మలపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి బయలుదేరిన నారాయణను కాంగ్రెస్ శాసనసభ్యుడు వెంకట్రామయ్య తన అనుచరులతో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ భూమిని పేదలకు పంచడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని ఆయన నారాయణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+