వచ్చేనెల 3కు ప్రశాంత్ రెడ్డి కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మృతి కేసు విచారణను మానవ హక్కుల కమీషన్ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. వెంకట్ తన భర్తను హత్య చేశాడని ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని మానవ హక్కుల కమీషనుకు ఫిర్యాదు చేశారు. దీనిపై మానవ హక్కుల కమీషన్ విచారణను చేపట్టింది.
తన భర్త హత్య కేసును ప్రభుత్వ అండదండలతో తప్పు దోవ పట్టించేందుకు కేశవరావు ప్రయత్నిస్తున్నారని విలాసిని గతంలో ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆమె పలువురిని ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications
