చంద్రబాబుది ఇదేం వరుస: రోశయ్య ప్రశ్న
హైదరాబాద్: ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వాకౌట్ చేస్తున్నానని చెప్పడానికి కూడా చంద్రబాబు అరగంట ప్రసంగం చేయడమేమిటని ఆయన సోమవారం శాసనసభలో అన్నారు. సంక్షేమ వసతిగృహాల్లో సౌకర్యాల కొరతపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నారని చెప్పడానికి ముందు చంద్రబాబు చేసిన ప్రసంగం తీరుపై రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు, దేశరాజకీయాలను తన వేలితో నడిపించిన చంద్రబాబు శాసనసభలో పొంతన లేని ప్రసంగం చేశారని ఆయన అన్నారు. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వ సమాధానానిి సంతృప్తి చెందకపోవడంతో వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి బదులు సుదీర్ఘంగా చంద్రబాబునాయుడు మాట్లాడారని ఆయన అన్నారు. సంబంధం లేని మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన స్పీకరును కోరారు.












Click it and Unblock the Notifications
