పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్న శ్రీజ దంపతులు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులు సికింద్రాబాదులోని కవాడిగుడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారంనాడు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు.
ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకుని ఢిల్లీ వెళ్లిన శ్రీజ దంపతులు ఆదివారం ఉదయం విమానంలో హైదరాబాదుకు తిరిగి వచ్చారు. వారు శిరీష్ భరద్వాజ్ ఇంటికి వెళ్లకుండా చిరాన్ పోర్టు క్లబ్ సమీపంలోని క్రిషి గార్డెనులోని ఫ్లాటుకు వెళ్లారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేస్తారనే భయంతోనే తాము బేగంపేట విమానాశ్రయం నుంచి ఎవరికి కనబడకుండా వచ్చామని వారు ఆదివారంనాడు చెప్పారు. రక్షణ కల్పిస్తామని పోలీసు కమీషనర్ హామీ ఇచ్చినందు వల్లనే తాము హైదరాబాదు వచ్చామని వారు చెప్పారు. తన కుటుంబ సభ్యులు రానందుకు తనకేమీ బాధ లేదని శ్రీజ చెప్పింది. అత్తామామలు తనను బాగా చూసుకుంటున్నారని కూడా ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications
