టిడిపి ఎమ్మెల్సీలకు సుధాకర్ రెడ్డి క్షమాపణలు
హైదరాబాద్: తెలుగుదేశం సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దుర్భాషలాడారనే ఆరోపణపై తలెత్తిన వివాదం సమసిపోయింది. హోంమంత్రి కె. జానారెడ్డి దౌత్యం నెరిపి ఈ వివాదాన్ని పరిష్కరించారు. శాసనమండలి సమావేశంలో ఆందోళనకు దిగిన తెలుగుదేశం సభ్యులను సుధాకర్ రెడ్డి దుర్భాషలాడారనే ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం సభ్యులకు పొంగులేటి సుధాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తానూ, తెలుగుదేశం సభ్యుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ మంచిమిత్రులమని ఆయన అన్నారు. వివాదంపై శాసనమండలి ఫ్లోర్ లీడర్లతో జానా రెడ్డి అంతకు ముందు మాట్లాడారు.












Click it and Unblock the Notifications
