అసెంబ్లీ: ప్రతిపక్షాల వాకౌట్లు
హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పన్నుల పెంపుపై, సంక్షేమ వసతిగృహాల్లో దుర్భర పరిస్థితులపై విపక్షాలు సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. మున్సిపాలిటీల్లో పన్నుల పెంపుపై సిపియం, సిపిఐ సభ్యులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రపంచ బ్యాంకు రుణాల కోసం తహతహలాడుతున్న ప్రభుత్వం ఆ బ్యాంకు విధానాలనే అమలు చేస్తేందని వారు విమర్శించారు. దీనిపై మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావు సమాధానం చెప్పారు. అయితే ఈ సమాధానానికి సంతృప్తి చెందని సిపియం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలుగుదేశం, మజ్లీస్ నిరసనలు వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో దుస్థితిపై ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. హాస్టళ్లను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తప్పు పట్టాయి. హాస్టళ్లలోని విద్యార్థుల పరిస్థితి ఖైదీల కన్నా దారుణంగా ఉందని అన్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం, సిపిఐ, సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications
