సాయం కావాలంటే నాన్న అడగమన్నారు: శ్రీజ
హైదరాబాద్: నాన్న గారు తనతో మాట్లాడారని, తనకు చాలా సంతోషంగా ఉందని శిరీష్ భరధ్వాజ్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ అన్నారు. నాన్న తనతో మాట్లాడారని, ఏదైనా సహాయం కావాలంటే తనను అడుగుమన్నారని ఆమె చెప్పారు. పెళ్లి రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రం తీసుకోవడానికి సికింద్రాబాదులోని కవాడిగూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భర్తతో పాటు వచ్చిన ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తమకు నాన్నగారి ఆశీస్సులు ఉన్నాయని ఆమె చెప్పారు. తనకు నాన్నగారు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారని, తమ ఇద్దరిని నాన్నగారు దీవించారని ఆమె అన్నారు. నాన్నగారు వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటానని ఆమె చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నామని శిరీష్ భరద్వాజ చెప్పారు.












Click it and Unblock the Notifications
