స్పీకర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: దేవేందర్ గౌడ్
హైదరాబాద్: శాసనసభలో తమ వ్యవహారశైలిని తెలుగుదేశం పార్టీ సమర్థించుకుంది. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్ బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. స్పీకర్ బెదిరింపులకు తాము లొంగేది లేదని ఆయన అన్నారు. స్పీకర్ ఎవరి మీద అలుగుతున్నారు, తమను బెదిరిస్తున్నారా అని ఆయన అడిగారు. బిసిలకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తే స్పీకర్ కు కోపం ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.
బిసిలకు జరుగుతున్న అన్యాయంపై తాము ప్రభుత్వాన్ని నిలదీశామని, మూడున్నర ఏళ్లుగా బిసిలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, తాము దాని గురించి ప్రస్తావించామని ఆయన అన్నారు. కోట్ల రూపాయల భూములు అమ్ముతున్నారని, బిసిలకు కేటాయించడానికి నిధులు ఎందుకుండవని ఆయన అన్నారు. బిసిలకు సరిగా నిధులు కేటాయించడం లేదనే విషయాన్ని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని ఆయన అన్నారు. ఆ విషయం ప్రస్తావించలేనప్పుడు సభ ఎందుకని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications