మాజీ నక్సలైట్ నయీం అపహరణ
హైదరాబాద్: మాజీ నక్సలైట్ నయీం అపహరణకు గురయ్యాడు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. నయీం బెంగుళూర్ నుంచి హైదరాబాదుకు బస్సులో వస్తుండగా అతను అపహరణకు గురయ్యాడు. నయీంతో పాటు బస్సులోని మరో ముగ్గురు వ్యక్తులు కూడా కనిపించకుండా పోయారు. ఆ ముగ్గురు వ్యక్తులే నయీంను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
నయీం కనిపించకుండా పోవడంతో అతనితో పాటు ప్రయాణిస్తున్న అతని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులో, పోలీసులో నయీంను కిడ్నాప్ చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనను పోలీసులు ఖండిస్తున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం కొంతకాలం అప్పటి పీపుల్స్ వార్ ఇప్పటి మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. అనంతరం బయటకు వచ్చాడు. పురుషోత్తం, ఆజం అలీ వంటి పౌర హక్కుల నాయకుల హత్యలతో నయీంకు సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications