తెలంగాణపై కాలయాపన పార్టీకి నష్టం: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన చేస్తే పార్టీ నష్టపోతుందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో తమ పార్టీ నాయకత్వం చేస్తున్న జాప్యాన్ని ఇతర పార్టీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తమ పార్టీ నాయకులు తలో మాట మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని, ఇది వరకే చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి పార్టీ అధిష్ఠానవర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని, తాము పోరాటం చేస్తామని చెప్పబోమని ఆయన అన్నారు. సోనియాను కలవడానికి ఈ నెలాఖరున ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications