తిరుపతిలో వీడని బాలుడి కిడ్నాప్ మిస్టరీ
తిరుపతి: తిరుపతిలో మంగళవారం కిడ్నాప్ నకు గురైన గురుశ్రీను అనే బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గురుశ్రీనును అపహరించినవారు తిరుపతి నుంచి బయటకు వెళ్లిపోలేదని పోలీసులు నమ్ముతున్నారు. కిడ్నాపర్లు మంగళవారం రాత్రి వరకు గురుశ్రీను తల్లిదండ్రులకు ఫోన్లు చేశారు. బుధవారం ఫోన్ కాల్స్ ఆగిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
భారతీయ విద్యాభవన్ పాఠశాల నుంచి గురుశ్రీను కిడ్నాప్ నకు గురయ్యాడు. గురుశ్రీనుకు ఫియర్ కాంప్లెక్స్ ఉందని, దానికి గురైనప్పుడు శ్వాస ఆగిపోయి శరీరం నీలంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications