బడే దర్గాను సందర్శించిన అభిషేక్, ఐష్ దంపతులు
కడప: బాలీవుడ్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గురువారం ఉదయం బడే దర్గాను సందర్శించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ సూచన మేరకు వీరు బడేదర్గాను సందర్శించారు. అభిషేక్ దంపతులతో పాటు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, అమితాబ్ బచ్చన్ కుటుంబ మిత్రుడు అమర్ సింగ్ కూడా వచ్చారు. దర్శనం బాగా జరిగిందని అమర్ సింగ్ చెప్పారు. అభిషేక్ దంపతులను చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బడే దర్గాలో అభిషేక్ దంపతులు పూజలు నిర్వహించి చదర్ సమర్పించారు. వారి వెంట అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కూడా వచ్చారు. రెహ్మాన్ తరుచుగా దర్గాకు వస్తుంటారు.
అభిషేక్ తండ్రి అమితాబ్ మాత్రం రాలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అమీర్ పీర్ దర్గా అయిన ఇది బడే దర్గాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఇది దక్షణాది అజ్మీర్ దర్గాగా పేరు పొందింది. ఈ దర్గాను 1683ోబ బీదర్ నుంచి వచ్చిన మహ్మద్ ప్రవక్త వంశీయుడు కట్టించారని చెబుతారు. బడే దర్గాను సందర్శించిన అనంతరం అభిషేక్ దంపతులు కడప నుంచి బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications
