అవినీతి డబ్బుతో వైయస్ పత్రిక, చానెల్: బాబు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి డబ్బులతో పత్రిక, టీవీ చానెల్ పెడుతున్నారని, వాటినీ చూస్తామని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో విలేకరుల అరెస్టుపై గురువారం శాసనసభ దద్ధరిల్లింది. అనుకూలంగా వార్తలు రాస్తే భేష్ అంటారని, వ్యతిరేకంగా రాస్తే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. మీడియాను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
మీడియా అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. విలేకరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు పత్రికలు వద్దనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు నాయని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలోకి వస్తుందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications
