సామాజిక సేవ చేస్తా: పార్వతీ మెల్టన్
హైదరాబాద్: సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచన ఉందని తెలుగు సినిమా హీరోయిన్ పార్వతీ మెల్టన్ అన్నారు. అపోలో అస్పత్రి నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలతో సరదాగా గడిపారు. తనకు ఈ కార్యక్రమం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆమె చెప్పారు.
పార్వతీ మెల్టన్ మధుమాసం వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె బుద్ధ అనే సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన జల్సా సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. తెలుగు భాషను నేర్చుకోవాలని తపన పడుతున్న ఈ హీరోయిన్ తెలుగు సంస్కృతి అంటే తనకెంతో ఇష్టమని ఒకానొక సందర్భంలో చెప్పారు.












Click it and Unblock the Notifications
