సురేష్ రెడ్డికే కోపం వచ్చిందంటే...: రోశయ్య
విశాఖపట్నం: ఎంతో సౌమ్యుడైన స్పీకర్ సురేష్ రెడ్డికే కోపం వచ్చిందంటే శాసనసభలో సభ్యుల వ్యవహారశైలి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు. సురేష్ రెడ్డి కన్నా అనుభవజ్ఞులు ఇంతకు ముందు స్పీకరుగా పనిచేశారని, వయస్సులో సురేష్ రెడ్డి చిన్నవాడైనా సౌమ్యుడని ఆయన అన్నారు.
సురేష్ రెడ్డి చదువుకున్నవారని, నమ్రత, సమర్థత, సంయమనం ఉన్నవారని, సభను ఎంతో సౌమ్యంగా నడుపుతున్నారని, అటువంటి సురేష్ రెడ్డికే కోపం వచ్చేలా సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభ్యులు శాసనసభలో సరిగా వ్యవహరించడం లేదని, ఒక పార్టీకి చెందిన సభ్యులు మాత్రమే అలా వ్యవహరిస్తున్నారని చెప్పలేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
