తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ: పండుగ సందడి
హైదరాబాద్: హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం తెలంగాణ భవన్ లో గురువారం పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భూమి పూజ చేశారు. తెలంగాణ జానపద కళలను కళాకారులు ప్రదర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగే చోట చంద్రశేఖరరావు యంత్రాన్ని పెట్టారు.
బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 2లో ఉన్న తెలంగాణతల్లి విగ్రహాన్ని ర్యాలీగా తేవడానికి సాయంత్రం ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం ఈ ర్యాలీ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి విగ్రహ చిత్రానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కు చెందిన బివిఆర్ చారిగా పేరు పొందిన బైరోజు వెంకటరమణాచారి రూపకల్పన చేశారు. తెలంగాణ తల్లి ఒక చేతిలో బోనం, మరో చేతిలో జొన్నకంకులు పెట్టి చిత్రాన్ని గీశారు. ఈ నమూనాకు అనుగుణంగా విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని ఫైబర్, మల్టీకలర్ తో రూపొందించారు.












Click it and Unblock the Notifications
