సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి, తెరాస వాకౌట్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి వారు సంతృప్తి చెందలేదు. రెండేళ్లలో 8 ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. కోర్టు కేసుల వల్లనే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.
ప్రభుత్వ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాలువలు తవ్వకుండా నీరు ఎలా ఇస్తారని ఆయన అడిగారు. వ్యవసాయం చేయడం దండుగ అని తాను ఎప్పుడూ అనలేదని, అదంతా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దుష్ప్రచారమని ఆయన ఒక సందర్భంలో అన్నారు. ప్రజలకు నగరాలకు తరలి రావాలని పిలుపునిచ్చిన రాజశేఖర రెడ్డికి వ్యవసాయంపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
