చిరంజీవితో మేం మాట్లాడలేదు: నారాయణ
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవితో తాము మాట్లాడలేదని, మాట్లాడబోమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. తాము చిరంజీవిని ఇప్పటి వరకు కలుసుకోలేదని, కలుసుకోవాలనే ఆలోచన కూడా లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఒకవేళ చిరంజీవి పార్టీ పెడితే ఆ పార్టీ విధానాలను బట్టి మాట్లాడే విషయం ఆలోచిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చేసిన ప్రకటన సరైంది కాదని, రాఘవులు ఏకపక్షంగా ప్రకటన చేశారని, తృతీయ ప్రత్నామ్నాయం ఏర్పాటుకు సిపియం సానుకూలంగా ప్రతిస్పందించాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయానికి ప్రయత్నాలు చేయాలని తమ ఇరు పార్టీలు చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాయని, అందుకు అనుగుణంగా సిపియం వ్యవహరించాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
