అసెంబ్లీ స్తంభన: సోమవారానికి వాయిదా
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నోడల్ ఎజెన్సీ జీవోలపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని విపక్షాలు శుక్రవారం సభా కార్యక్రమాలను స్తంభింపజేశాయి. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. నోడల్ ఏజెన్సీల జీవోలు మర్చాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఎంతగా చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభను స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
నోడల్ ఏజెన్సీపై సభ్యుల సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అంతకు ముందు ముఖ్యమంత్రి చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి అర్థాంతరంగా సభ నుంచి వెళ్లిపోవడాన్ని ప్రతిపక్షాలు నిరసించాయి. ముఖ్యమంత్రి సభలో ఉండాలని, తమ సందేహాలకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు.












Click it and Unblock the Notifications
