హైదరాబాద్ లో 30న ఐటి సదస్సు
హైదరాబాద్: వరల్డ్ యూజబిలిటీ డే నవంబర్ 30 న హైదరాబాద్ లో జరుగనుంది. హైదరాబాద్ కు చెందిన యూజబిలిటీ డాట్ ఆర్గ్ (http://www.usabilitymatters.org/)
డిజైన్ అవేర్ నెస్, డిజైనర్ల మధ్య ఇంటరాక్టివిటీని పెంపొందిచడం, తద్వారా ఐటీ పరిశ్రమకు, డిజైన్ సెన్సిటివ్ వినియోగదారులకు సహాయపడడం ఈ యుఎంవో ఉద్దేశం. ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.
యూజబిలిటీ ఇంజినీరింగ్ ను, యూజర్ సెంటర్డ్ డిజైనింగ్ ను అభివృద్ధి చేసేందుకు ఏటా వరల్డ్ యూజబిలిటీ డే జరుగుతోంది. ఈసారి హైదరాబాద్ దీనికి వేదిక కావడం విశేషం. నవంబర్ 30 న హైదరాబాద్ లో జరిగే ఈ సదస్సులో ఐటి రంగ నిపుణులు, పరిశ్రమ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం తదితర ప్రముఖ ఐటి కంపెనీల ప్రతినిధులు సదస్సులో ప్రసం గిస్తారు.












Click it and Unblock the Notifications
