నిర్మాత కిషోర్ రాఠీ ఇంటిపై పోలీసుల దాడి
హైదరాబాద్: సినీ నిర్మాత కిషోర్ రాఠీ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. భారత, పాక్ వన్డే మ్యాచ్ బెట్టింగ్ బుకీలు ఇచ్చిన సమాచారం మేరకు కిషోర్ రాఠీపై, ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిశోర్ రాఠీ, ఆయన కుమారుడు పరారీలో ఉన్నారు.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహించిన ఇద్దరు బుకీలను సికింద్రాబాదులోని కుషాయిగుడా పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఈ ఇద్దరు బుకీలు కిషోర్ రాఠీ వద్ద పనిచేశారు. ఎ.ఎస్.రావు నగరులోని బుకీల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications
