రేణూ దేశాయ్ పాస్ పోర్టు అందడం లేదు: పోలీసులు
విశాఖపట్నం: సినీనటుడు పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడని చెప్పడానికి అవసరమైన సాక్ష్యాలు లభించడం లేదని, అందువల్ల నివేదిక సమర్పణలో జాప్యం జరుగుతోందని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. పాస్ పోర్టు, రేణూ దేశాయ్ కాన్పు జరిగినప్పుడు ఆస్పత్రిలో నమోదైన వివరాలు అందడం లేదని, వాటిలో రేణూ దేశాయ్ ని పవన్ కళ్యాణ్ భార్యగా పేర్కొన్నారా లేదా తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నివేదిక సమర్పించక పోవడంతో పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి కేసు విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది.
నివేదిక సమర్పణలో జాప్యం జరుగుతుండడం పట్ల కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు నెలలుగా పోలీసులు నివేదిక సమర్పించకపోవడం పట్ల కోర్టు ఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ పూర్తయినంత వరకు నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications
