Maremma First Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. పక్కా గూస్ బంప్స్ మూవీ.. మిస్ కావొద్దు..!!
మాస్ మహారాజ రవితేజ ఇటీవల 'ఇరుముడి' మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. డివోషనల్ ప్లస్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న చిత్రం మారెమ్మ. ఈ మూవీ కూడా డివోషనల్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. అలాగే మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. మారెమ్మ చిత్రంలో మాధవ్ సరసన హీరోయిన్ గా తమిళ బ్యూటీ దీపా బాలు నటించింది. వీరితో పాటు ఈ మూవీలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక మారెమ్మ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలు అంటే.. 135 నిమిషాలుగా ఉంది. తక్కువ రన్ టైమ్ కావడంతో సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. అనవసరమైన వాటికి పోకుండా స్ట్రెయిట్ గా పాయింట్ చెప్పే ప్రయత్నం చిత్ర యూనిట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీకి సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ సినిమా చూసేందుకు అర్హులని అర్థం. ఇక మారెమ్మ సినిమా మిగతా సినిమాల మాదిరి కాదు.. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ డివోషనల్ థ్రిల్లర్ కథే ఈ సినిమా. పెంపుడు జంతువులు, మానవుల మధ్య సంబంధాలను ఈ మూవీ ద్వారా సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు మంచాల నాగరాజు. వరంగల్ జిల్లాలోని మహిషాపురం అనే గ్రామంలో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఊరిలో ప్రమాదకరమైన వ్యాధి సోకి అంతా చనిపోతుంటారు. ప్రజలంతా భయంతో ఉన్న సమయంలో ఆ ఊరిలో ఓ దున్నపోతు జన్మిస్తుంది. అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఓ జ్యోతిష్యుడు చెబుతాడు.
ఆ దున్నపోతుకు మారెమ్మ అని పేరు పెట్టి దేవతగా భావిస్తారు ప్రజలు. అయితే ఆ దున్నుపోతును చూసుకునే బాధ్యత పశువుల కాపరి అయిన మారి(మాధవ్ భూపతిరాజు) కు ఇస్తారు. అయితే అనుకోని సంఘటనల కారణంగా ఆ దున్నపోతు కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేదే స్టోరీ. డివోషనల్ ప్లస్ థ్రిల్లర్ కథాంశం కావడంతో ఈ మూవీతో మాధవ్ హిట్ కొట్టాడని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఫుల్ రివ్యూ కావాలంటే సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
