సినిమా సీక్వెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.. సెన్సార్ టీం ప్రశంసలు
వర్సటైల్ నటులు సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'మండాడి' రేపు (సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహిమా నంబియార్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున విడుదల చేస్తోంది.
సెన్సార్ పూర్తి
తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. మూవీ చూసిన సెన్సార్ టీం సభ్యులు అద్భుతంగా వచ్చిందని అభినందించారు. ముఖ్యంగా ఇందులో వచ్చే బోట్ సీక్వెన్సెస్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని, థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయమని కొనియాడారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి.

నేపథ్య సంగీతం మరో స్థాయి
మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎస్.ఆర్. కథిర్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో గ్రాండ్‌గా, విజువల్ ఫీస్ట్‌లా మలిచాయి.పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు మాస్, యాక్షన్ ప్రియులను థ్రిల్ చేయనున్నాయి. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం ఈ ప్రాజెక్ట్‌కి బలాన్ని చేకూర్చింది.
బుక్ మై షోలో టికెట్ల సునామీ
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. బుక్ మై షోలో ప్రతి గంటకూ వేలాది టికెట్లు అమ్ముడవుతుండటం సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. సుహాస్, సూరి ఇద్దరి కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలవబోతోంది.














Click it and Unblock the Notifications
