ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను కొట్టేసిన వైయస్
హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తేలికగా కొట్టిపారేశారు. తెలంగాణ అంశాన్ని తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ నిర్ణయానికి వదిలేశామని, దానిపై పదే పదే స్పందించాల్సిన అవసరం లేదని ఆయన శుక్రవారంనాడు అన్నారు. వరికి మద్దతు ధరపై రాజకీయ పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వ్యవసాయం దండుగ అని మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఎఐసిసి సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నానని, వరికి మద్దతు ధరపై ఆ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. వరి, గోధుమ ధరల మధ్య వ్యత్యాసం కేవలం 75 రూపాయలు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. 1997 నుంచి ఇలాగే ఉందని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆ వ్యత్యాసం 225 రూపాయలు ఉండేదని ఆయన అన్నారు. వరికి బోనస్ ఈ ఏడాది నుంచే ఇస్తామని, గోధుమకు బోనస్ ను వచ్చే ఏడాది నుంచి ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
