ఈ జన్మకు గోకుల్ చాట్ తింటే చాలు!?!?!
కోటిలోని గోకుల్ చాట్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఆగస్టు 25న బాంబ్ బ్లాస్ట్ లో చాలామంది చనిపోయిన తరువాత చాలా కాలం తరువాత మళ్లీ గోకుల్ చాట్ శనివారం తిరిగి ప్రారంభం అయింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని ఈ మారు గోకుల్ చాట్ ను ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ముందుగా మృతులకు నివాళులు అర్పించిన తరువాత చాట్ ను ప్రారంభించారు. టీవీ చానెళ్లు కూడా అక్కడిరి చేరుకోవడమే కాదు..జనాలు కూడా ప్రాణాలు పోతే పోయాయి ఈ జన్మకు గోకుల్ చాట్ తింటే చాలు అన్నటుగా పునఁప్రారంభమైన తొలి రోజే ఎగబడితింటున్నారు. ఇంతటి టేస్ట్ మరెక్కడా దొరకని టీవీ చానళ్ల మైకులు దొరకబుచ్చుకుని మరీ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
