పొన్నాల రాజీనామాకు కెసిఆర్ డిమాండ్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలకు బాధ్యత వహించి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలపై కాగ్ నివేదిక ఎత్తిచూపిన నేపథ్యంలో ఆయన బుధవారం ఈ డిమాండ్ చేశారు. రెండు ప్రాజెక్టుల కింద ఒకే ఆయకట్టును చూపి పొన్నాల లక్ష్మయ్య ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి ఆస్కారం లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వివరణ ఇచ్చారు. ఇపిసి విధానం తెలియకపోవడం వల్ల కాగ్ నివేదికలో అలా జరిగిందని ఆయన అన్నారు. ఇపిసి కొత్త విధానమని, పాత విధానాన్ని అనుసరించడం వల్ల కాగ్ నివేదిక తప్పుగా వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications