రైతులపై ప్రతిపక్షాల కపట ప్రేమ: రఘువీరా
హైదరాబాద్: రైతులపై ప్రతిపక్షాలు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘవీరా రెడ్డి వ్యాఖ్యానించారు. వరికి మద్దతు ధర ప్రకటించాలనే అఖిల పక్ష రైతు సంఘాల డిమాండ్ న్యాయమైందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రైతు సంఘాలు ప్రతిపక్షాలను బందులో కలుపుకొని ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం, బిజెపిలపై రైతులకు నమ్మకం లేదని, ఆ పార్టీలు వాటి తొమ్మిదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని ఆయన అన్నారు. గోధుమ ధర వరి ధరకన్నా ఎక్కువైంది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అదికారంలో ఉన్నప్పుడేనని, ఈ విషయాన్ని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications