రాజ్యసభలో వరికి మద్దతు ధర ప్రస్తావన
న్యూఢిల్లీ: వరికి మద్దతు ధర అంశం బుధవారం రాజ్య సభలో ప్రస్తావనకు వచ్చింది. వరికి వేయి రూపాయల మద్దతు ధర ప్రకటించాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని సభ్యులు జీరో అవర్ లో ప్రస్తావించారు. దీనిపై చర్చకు తర్వాత అనుమతిస్తానని సభాధ్యక్షడు చెప్పారు.
వరికి రూ.675 మద్దతు ధర ఉండగా గోధుమలకు వేయి రూపాయలు ఉందని, ఈ వివక్ష సరికాదని తెలుగుదేశం సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. తమ పార్టీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన తర్వాత రూ. 50 బోనస్ ప్రకటించారని ఆయన చెప్పారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు కె. కేశవరావు కూడా అభిప్రాయపడ్డారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర ఇవ్వాలనే డిమాండును సీతారాం ఏచూరి (సిపియం), రాజా (సిపిఐ) సమర్థించారు.












Click it and Unblock the Notifications