వెంకట్ అనుచరుడు రమేష్ నాయుడిపై కేసు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో నిందితుడైన పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. వెంకట్ అనుచరుడు రమేష్ నాయుడు తనపై దాడి చేశాడని శివశంకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రమేష్ నాయుడిపై కేసు నమోదు చేశారు.
వెంకట్ పేరు చెప్పుకుని రమేష్ నాయుడు తనపై దాడికి దిగాడని శివశంకర్ ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రమేష్ నాయుడు కంచె తొలగించి తనపై దాడి చేశాడని శివశంకర్ ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications
