వైభవంగా తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
తిరుపతి: ఈ నెల 30వ తేదీ వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే తెలుగు భాషా బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారంనాడు తిరుపతిలో జానపద కళారూపాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన ప్రజలకు కనువిందు చేసింది. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) మైదానం నుంచి ప్రధాన వీధుల గుండా ఈ ప్రదర్శన సాగింది.
ఈ మహా ప్రదర్శనను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. తప్పెట గుళ్లు, బుడబుకలు, గరగలు, గురవయ్యలు, పులివేషాలు, థింసా, జంగం దేవర వంటి నృత్య కళా రూపాల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. తెలుగు భాషపై అభిమానంతో అభివృద్ధికి కృషి చేయాలని కరుణాకర్ రెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications
