సంజయ్ దత్ కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో ఆరుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందినవారిలో సంజయ్ మిత్రుడు యూసుఫ్ నల్ వల్లా కూడా ఉన్నాడు. బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
టాడా కోర్టు విధించిన శిక్షను సంజయ్ దత్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని సంజయ్ దత్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కేసు నడుస్తున్న గత పదేళ్లలో సంజయ్ ఎప్పుడు కూడా చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని ఆయన కోర్టుకు విన్నవించారు. టాడా కోర్టు తీర్పు ప్రతి అందకపోవడంతో సంజయ్ కు రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత వారం తీర్పు ప్రతి అందడంతో ఆయన కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎరవాడ జైలులోనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications
