జర్నలిస్టులపై విరుచుకుపడ్డ జానారెడ్డి
నల్లగొండ: హోంమంత్రి కె. జానారెడ్డి విలేకరులపై మండిపడ్డారు. నల్లగొండలోని జిల్లా పరిషత్ సమావేశం గదిలో మంగళవారం ఏర్పాటైన ఆర్. డబ్ల్యు.ఎస్. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆయన విలేకరులను ఆదేశించారు. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
మీ డిమాండు ఏమిటి, ఏం చూసుకుంటారో చూసుకోండి అని విలేకరులపై ఆయన విరుచుకుపడ్డారు. జానారెడ్డి వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టులు ధర్నాకు దిగారు. క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
