నా ఒంటిపై కిరోసిన్ పోశారు: రాజ్యలక్ష్మి
హైదరాబాద్: చర్చలకు వెళ్లిన తనపై వికలాంగులు కిరోసిన్ పోశారని, తలపై నుంచి కింది దాకా కిరోసిన్ పోశారని మంత్రి రాజ్యలక్ష్మి చెప్పారు. పదిమంది మేం పోతే మీరు పోతారనే పద్ధతిలో వ్యవహరించిన స్థితిలో తాను, మంత్రి ముఖేష్ చర్చలకు వెళ్లామని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వాసన చూడండి అంటూ ఆమె తన చేయిని మీడియా ప్రతినిధుల వైపు సాచారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని ఆమె చెప్పారు.
పింఛను 1500 రూపాయలకు పెంచే విషయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తాము చెప్పినట్లు ఆమె తెలిపారు. వికలాంగులు మొండి పట్టు పట్టడం సరి కాదని ఆమె అన్నారు. వికలాంగుల ప్రతినిధులతో మరో దఫా చర్చలు ఉండవని ఆమె చెప్పారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications
