ప్రేమ పెళ్లి కోసం స్వప్న కిడ్నాప్ డ్రామా
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో గల బంజారా కాలనీ నుంచి అదృశ్యమైన స్వప్న అనే యువతి తిరుపతిలో పోలీసులకు పట్టుబడింది. స్వప్నను కిడ్నాప్ చేశారని, ఇందులో ఆటో డ్రైవర్ పాత్ర ఉందని స్వప్న తండ్రి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురును కనిపెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన హోంమంత్రి కె. జానా రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో తిరుపతిలో ఆమె పట్టుబడింది.
స్వప్న ప్రేమ పెళ్లి చేసుకోవడానికి తిరుపతి పారిపోయినట్లు చెబుతున్నారు. ఆమెను పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు. ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసభ్యంగా ప్రవర్తించడంతో స్వప్న ఒక ఆటో డ్రైవరును చెప్పుతో కొట్టిందని, అతనే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని అంటూ వచ్చారు. దీంతో పోలీసులు ఎర్రగడ్డ ప్రాంతంలోని ఆటో డ్రైవర్లందరినీ పిలిపించి విచారించారు. సోమవారంనాడు నిందితుడి ఊహాచిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారంలో తమను పోలీసులు వేధించారని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు మంగళవారంనాడు అల్లాపూర్ లో ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications
