స్వప్న డ్రామాపై ఆటో డ్రైవర్ల ధర్నా
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలోని స్వప్న అనే యువతి కిడ్నాప్ డ్రామా మరో మలుపు తిరిగింది. ఆటో డ్రైవర్లు మంగళవారం సనత్ నగర్ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. స్వప్న తల్లిదండ్రులపై కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరి ధర్నాతో సనత్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద వాతావరణం వేడెక్కింది.
స్వప్న ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు ముందే తెలుసునని, అయినా కిడ్నాప్ డ్రామా ఆడారని వారంటున్నారు. తమపై తప్పుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమను వేధిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. స్వప్న కిడ్నాప్ కేసులో నిందితుడిని గుర్తించడానికి పోలీసులు ఆటో డ్రైవర్లను పిలిపించి విచారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
