రహస్య ప్రదేశానికి తస్లీమా తరలింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను కేంద్రం ఆధీనంలోకి తీసుకుని ఢిల్లీ నుంచి రహస్య ప్రదేశానికి తరలించింది. న్యూఢిల్లీలోని రాజస్థాన్ హౌస్‌లో ఉంటున్న తస్లీమాను సోమవారం అర్థరాత్రి సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు మీడీయా కంట పడకుండా ఓ కారులో రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళారు. మరోవైపు పార్లమెంట్‌లో సోమవారం బీజేపీ దీనిపై చర్చ లేవనెత్తింది. కేంద్రం, వామపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తస్లీమా వివాదం విషయంలో కేంద్రం మౌనం దాల్చడాన్ని తప్పుబట్టారు.
ఇటీవల తస్లీమా ఉండడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలో పెద్ద ఎత్తున అల్లర్లు రేగిన అనంతరం ఆమెను జైపూర్ కు తరలించారు. అక్కడ హెచ్చరికలు రావడంతో శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి తస్లీమా న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు శాస్వత భారత పౌరసత్వం కల్పించాలని ఇప్పటికే బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కొల్‌కతాలో ఉండొచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య చెప్పగా, తాను కూడా ఆ పరిస్థితే కోరుకుంటున్నానని తస్లీమా వ్యఖ్యానించారు.












Click it and Unblock the Notifications
