కృష్ణాలయాన్ని సందర్సించిన ఐష్, అభిషేక్
అహ్మదాబాద్: బాలీవుడ్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బుధవారంనాడు గుజరాత్ లోని ద్వారకా శ్రీకృష్ణాలయాన్ని సందర్సించారు. వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాత హరివంశ రాయ్ బచ్చన్ జయంతి సందర్భంగా వారు ఈ దర్శనం చేసుకున్నారు. మంచి సంతానాన్ని కోరుతూ వారు పూజలు చేశారు.వారితో పాటు బాలీవుడ్ బాదుషా అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ కూడా ఉన్నారు. అభిషేక్, ఐశ్వర్య దంపతులు పెళ్లి అయినప్పటి నుంచి దర్గాల చుట్టూ తిరుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
