వరికి ఎంతిచ్చినా తక్కువే: దిగ్విజయ్
హైదరాబాద్: వరికి మద్దతు ధర ఎంతిచ్చినా తక్కువేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన బుధవారం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
గోధుమను వరితో పోల్చడం సరికాదని ఆయన అన్నారు. రెండు పంటలు వేర్వేరని ఆయన అన్నారు. లేక్ వ్యూ అతిథి గృహంలో దిగ్విజయ్ సింగ్ ను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కలిశారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జిగా తప్పుకున్న తర్వాత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications
